కేయూ క్రికెట్ విజేత ‘వరంగల్ జోన్’
ఖమ్మం స్పోర్ట్స్ : కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీలు నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో ఆదివారం ముగిశాయి. పోటీల్లో వరంగల్ జోన్ జట్టు ఘన విజయం సాధించి టైటిల్ సాధించింది. వరంగల్ జోన్ – ఖమ్మం జోన్ జట్ల మధ్య ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జోన్ నిర్ణీత 30 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. డేవిన్ 43, అజహాన్ 29, అభిలాష్ 12, సంతోష్ 13 పరుగులు చేయగా వరంగల్ బౌలర్లు హరిప్రసాద్ 3, వైష్ణవ్ 2, ఇబ్రహీం ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వరంగల్ జోన్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ జట్టులో విశాల్ యాదవ్ 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఫర్హన్ 11, హరిప్రసాద్ 17 పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించారు. ఖమ్మం బౌలర్లు నితిన్ 4, అజహర్ 3, శశి కుమార్‌లు ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్ కుమార్ రెడ్డి, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి. రమణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె.ఉపేందర్, పీడీ రఘునందన్, సెలెక్టర్లు ఎం. కుమార్, అఫ్జల్, గోపి, అస్లాం, ఎండీ మతిన్, ఆర్.ఉపేందర్, కమల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రన్నరప్‌గా ఖమ్మం జోన్ జట్టు
విజేతలకు బహుమతుల ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment