మరింత వేగంగా ‘సీతారామ’
ఖమ్మంసహకారనగర్: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టు పనులు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లి ట్రంక్, యాతాలకుంట టన్నెల్, జూలూరుపాడు టన్నెల్, పంప్ హౌస్‌ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం, పాలేరు నియోజకవర్గంలో లింక్ కెనాళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై ఆరా తీశారు. భూసేకరణపై నిర్వాసితులతో సంప్రదించి త్వరగా పూర్తిచేయాలని, అటవీ భూములపై ఆ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment