సంక్రాంతి, కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
ఖమ్మం రాపర్తినగర్: సంక్రాంతి పండగతో పాటు ప్రయాగలో జరగనున్న మహా కుంభమేళాకు వచ్చివెళ్లే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని ఖమ్మం రైల్వే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం. డీ.జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
సంక్రాంతికి...
సంక్రాంతి పండుగ సందర్భంగా చర్లపల్లి–తిరుపతి నడుమ నడిచే ప్రత్యేక రైలు ఈనెల 8, 11వ తేదీల్లో రాత్రి 22–18 గంటలకు, తిరుపతి–చర్లపల్లి రైలు జనవరి 10, 13, 17వ తేదీల్లో అర్ధరాత్రి 12–44గంటలకు ఖమ్మం వచ్చి వెళ్తాయి. నాందేడ్–కాకినాడ మధ్య ఈనెల 14న అర్ధరాత్రి 1–38గంటలకు, కాకినాడ–నాందేడ్ మధ్య ఈనెల 8, 15న అర్ధరాత్రి 1–24గంటలకు, కాచిగూడ–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈనెల 9, 16వ తేదీల్లో రాత్రి 9–52గంటలకు ఖమ్మం చేరుకుంటుంది.
కుంభమేళాకు...
విజయవాడ–గయా ప్రత్యేక రైలు(07093) ఫిబ్రవరి 5న రాత్రి 9–43గంటలకు, సీసీటీ–గయా ప్రత్యేక రైలు(07095) ఫిబ్రవరి 8న రాత్రి 9–43గంటలకు ఖమ్మం చేరుకుని బయలుదేరనున్నాయి. అలాగే, గుంటూరు నుంచి ఆజాంగఢ్ వెళ్లే ప్రత్యేక రైలు(07081) ఫిబ్రవరి 15న అర్ధరాత్రి 1–58గంటలకు, అజాంగఢ్–విజయవాడ ప్రత్యేక రైలు(07082) ఫిబ్రవరి 18న తెల్లవారుజామున 4–20గంటలకు, సీసీటీ–ఆజాంగఢ్ ప్రత్యేక రైలు(07085) ఫిబ్రవరి 21న అర్ధరాత్రి 1–58గంటలకు, ఆజాంగఢ్–విజయవాడవెళ్లే రైలు(07086) ఫిబ్రవరి 24న తెల్లవారుజామున 3–43గంటలకు ఖమ్మం చేరుకుని గమ్యస్థానాలకు బయలుదేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment