భద్ర‘గిరి పల్లె’కు స్వాగతం!
● భద్రాచలంలో పర్యాటకానికి సొబగులు ● ఐటీడీఏలో శరవేగంగా సాగుతున్న పనులు ● వెదురు నిర్మాణాలతో ఇళ్లు, సెల్ఫీ పాయింట్
భద్రాచలం: భద్రాచలం వచ్చే పర్యాటకులకు స్వచ్ఛమైన గిరిజన పల్లె అందాలను చూపించేందుకు సొబగులు అద్దుతున్నారు. విభిన్నమైన గిరిజన, ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను పట్టణవాసులకు, పర్యాటకులకు పరిచయం చేసేందుకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ కృషి ఫలించనుంది. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం పరిధిలో జరుగుతున్న గిరిజన పల్లె పనులు తుది దశకు చేరుకున్నాయి. ముక్కోటి ఉత్సవం రోజున భద్ర ‘గిరి పల్లె’ను ప్రారంభించనుండగా కార్మికులు చేస్తున్న పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment