వైష్ణవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్ : జిల్లా శ్రీ వైష్ణవ సేవా సంఘం క్యాలెండర్లను స్థానిక కమాన్‌బజార్ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శేషభట్టార్ రఘునాథాచార్యులు, ప్రధాన కార్యదర్శి కొదమసింహం రవికిరణాచార్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్‌సీహెచ్ రామకృష్ణమా చార్యులు, జిల్లా కన్వీనర్ ఎన్‌సీహెచ్. శ్రీనివాసాచార్యులు, సహాయ కోశాధికారి శ్రీరాయపురం రామకృష్ణమాచార్యులు, జిల్లా కోశాధికారి వేదాంతం ఫణికుమారాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరింగంటి భార్గవాచార్యులు, జి.గోపాల్, గౌరవ సలహాదారు కండ్లకుంట్ల రంగాచార్యులతో పాటు సభ్యులు ఎం.కేశవాచార్యులు, ఎ.మాధవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment