కొత్త వెలుగులు నింపాలి
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కొంత చలి తీవ్రత ఉంటుంది.
● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● క్యాంపు కార్యాలయంలో నూతన సందడి
ఖమ్మంవన్‌టౌన్ : ప్రతీ ఒక్కరి ఆశ, ఆకాంక్ష నెరవేరాలని, అందరి జీవితాల్లో నూతన సంవత్సరం కొత్త వెలుగులు నింపాలని దేవుడిని కోరుకుంటున్నానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం పలువురు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి అందరూ సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా, పలు మీడియా సంస్థలు, సంఘాలు, వ్యాపార సంస్థల డైరీలు, క్యాలెండర్లను పొంగులేటి ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment