చాంపియన్లుగా మహబూబ్‌నగర్, ఖమ్మం
ఖమ్మం స్పోర్ట్స్/మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నీ నెట్‌బాల్ పురుషుల విభా గంలో మహబూబ్‌నగర్, మహిళల విభాగంలో ఖమ్మం జట్లు చాంపియన్లుగా నిలిచాయి. మహబూ బ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంలో మూడు రోజులు గా నిర్వహిస్తున్న ఈ టోర్నీ గురువారం ముగిసింది. పురుషుల విభాగంలో మహబూబ్‌నగర్–ఖమ్మం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆట ముగిసే సమయానికి మహబూబ్‌నగర్ 19–16 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది. మహిళల ఫైనల్‌లో ఖమ్మం జట్టు మహబూబ్‌నగర్‌పై 23–6 పాయింట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన పురుషుల విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 19–7 పాయింట్ల తేడాతో మేడ్చల్ జట్టుపై, ఖమ్మం జట్టు 15–13 తేడాతో నారాయణపేట జట్టుపై గెలుపొందాయి. మహిళల సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 17–11 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై, ఖమ్మం జట్టు 18–12 తేడాతో మేడ్చల్ జట్లపై విజయం సాధించాయి. జిల్లా క్రీడాకారులు జయకేతనం ఎగురవేయడం పట్ల డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా నెట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షురాలు చింతనిప్పు దీప్తి, కార్యదర్శి ఎం.ఫణికుమార్, నెట్‌బాల్ కోచ్ పీ.వీ.రమణ అభినందనలు తెలిపారు.
ముగిసిన రాష్ట్రస్థాయి
సీఎం కప్ నెట్‌బాల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment