జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
ఖమ్మంసహకారనగర్: ఈనెల 7, 8, 9 తేదీల్లో జార్ఖండ్‌లో నిర్వహించే జాతీయస్థాయి అండర్–19 అథ్లెటిక్ పోటీలకు ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జి.వెంకటసాయి ఎంపికయ్యాడు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన 800 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగులో తృతీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.రామారావు తెలిపారు. పోటీలకు వెళ్లేందుకు కళాశాల సిబ్బంది రూ.4 వేలు ఆర్థిక సాయం అందించడంతోపాటు విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పీడీ జి.వెంకటేశ్వర్లు, గణిత అధ్యాపకుడు జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment