పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధి
ఖమ్మం సహకారనగర్: ఒకరికొకరు సహకరించుకుంటే అందరి అభివృద్ధి సాధ్యమై సమాజం పురోగమిస్తుందని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎస్‌టీఎఫ్ టీఎస్ ఆధ్వర్యాన సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో వారు మాట్లాడారు. సావిత్రిబాయి ఏళ్ల క్రితం వివక్ష ఉన్నప్పటికీ మహిళా విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఎస్‌టీఎఫ్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి డి.సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఐఈఓ రవిబాబు, డీఈఓ సోమశేఖరశర్మ, కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ నీరజ, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment