రూ.3లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ
సత్తుపల్లి టౌన్: సేవా కార్యక్రమాలే తమకు సంతృప్తినిస్తాయని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టిన రోజు సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన నిరుపేదలకు రూ.3లక్షల విలువైన తోపుడుబండ్లు, సోలార్ లైట్లు, ట్రై సైకిళ్లు, గొడుగులు, పాఠశాలలకు ఐరన్ బీరువాలు ఎమ్మెల్యే రాగమయి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే కాక ఆపన్నులకు అండగా నిలవడం తమ కర్తవ్యమని తెలిపారు. కాగా, నియోజకవర్గంలో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం వంటివి నిర్వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వందనపు సత్యనారాయణతో పాటు సోమిశెట్టి శ్రీధర్, ఇమ్మనేని ప్రసాద్ దొడ్డా శ్రీనివాసరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, తోట సుజలరాణి, చల్లగుల్ల నరసింహారావు, ఎండీ కమల్‌పాషా, చెన్నారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment