జీఎస్టీ చట్టాలపై అవగాహన అవసరం
ఖమ్మంగాంధీచౌక్: వస్తు సేవా పన్నుపై వివిధ వర్గాల వారికి అవగాహన పెంపొందించాలని వరంగల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ రావుల శశిధరాచారి సూచించారు. జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మంలో శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వస్తు సేవా పన్ను, సాంకేతికతపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రాక్టీషనర్ల అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు రంగీ నగేష్ మాట్లాడుతూ జీఎస్టీపై సమగ్ర అవగాహన లేక పన్ను చెల్లింపుదారులు వడ్డీ, జరిమానా కట్టాల్సి వస్తోందన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో కృషి జరగాల్సి ఉందని తెలిపారు. అనంతరం ఏపీ జీఎస్టీ, వ్యాట్, జీఎస్టీ విధివిధానాలను వివరించగా, ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించారు.
నూతన అధ్యక్షుడి సైదులు
జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈసందర్భంగా అధ్యక్షుడిగా ఉల్లిబోయిన సైదులు, ప్రధాన కార్యదర్శిగా కె.పవన్‌కుమార్, కోశాధికారిగా జి.రమేష్‌తో కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చుండూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జాయింట్ కమిషనర్ శశిధరాచారి
Comments
Please login to add a commentAdd a comment