● కేఎంసీ పరిధిలో సేకరించిన వ్యర్థాల తూకం ● ఆపై నిర్వహణకు ఏర్పాట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పరిధిలోని ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థల నుండి సేకరిస్తున్న వ్యర్థాలను శాసీ్త్రయంగా లెక్కకట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డంపింగ్‌యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు ఏరోజుకారోజు చెత్తను శుభ్రం చేసి, బయటకు తరలించే ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై డీపీఆర్ తయారీకి అధికారులు చేసిన సూచనలతో ఓ సంస్థ బాధ్యులు కొద్దిరోజులుగా పరిశీలన చేపట్టారు. రోజువారీగా 180 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తుండగా, డంపింగ్‌యార్డ్‌కు మాత్రం 200 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలు వస్తున్నాయని తేలింది. దీంతో రోజువారీ వచ్చే వ్యర్థాలను తూకం వేసేందుకు నిర్ణయించారు.
నేటి నుండి తూకం..
కేఎంసీ పరిధిలో సేకరించిన చెత్త, డంపింగ్ యార్డ్‌కు తరలించిన వ్యర్థాలను తూకం వేస్తారు. శనివారం నుండి నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తద్వారా సేకరించిన చెత్త, యార్డ్‌కు వచ్చిన చెత్తపై స్పష్టమైన లెక్కలు తేలనున్నాయి. ఈవిషయమై వాహనాల డ్రైవర్లకు ఇప్పటికే సూచనలు చేశారు. చెత్త సేకరణపై లెక్కలు తేలాక నిర్వహణపై ప్రైవేట్ ఏజెన్సీ బాధ్యులు డీపీఆర్ సిద్ధం చేసి కేఎంసీ అధికారులకు సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment