కారు సర్వీసింగ్ సెంటర్‌లో గంజాయి మొక్క
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్ యజమాని తన షెడ్డులో గంజాయి మొక్క పెంచుతున్నట్లు బయటపడింది. స్థానిక ఎన్నెస్పీ క్యాంపులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కూత వేటు దూరాన సెంటర్ యజమాని టైర్ రక్షణగా పెట్టి గంజాయి మొక్క పెంచుతున్నాడని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఖమ్మం టూటౌన్, ఎకై ్సజ్ సిబ్బంది ఆ మొక్కను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదొక్కటే మొక్క పెంచుతున్నాడా, ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, గతంలోనూ విక్రయించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఎత్తకెళ్లారు.. తెచ్చి పెట్టారు!
మధిర: మధిర రైల్వేస్టేషన్ నంబర్–2 ప్లాట్‌ఫామ్ వైపు నిలిపిన ద్విచక్రవాహనం గురువారం రాత్రి చోరీకి గురైంది. స్టేషన్‌లో క్లీనింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జిలుగుమాడుకి చెందిన గద్దల వెంకటేశ్వర్లు తన బైక్‌పై వచ్చి పార్క్ చేశాక విధులకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సాయంత్రంకల్లా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ను అక్కడే పార్క్ చేసి వెళ్లడంతో వెంకటేశ్వర్లు ఊపిరిపీల్చుకున్నాడు.
మహిళ మెడలో గొలుసు చోరీ
మధిర: మధిర రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. మధిరకు చెందిన రమణ తన భర్తతో కలిసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది. ఆమె రైలు దిగుతుండగా హఠాత్తుగా ఓ వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో రమణ గొలుసును గట్టిగా పట్టుకోగా అది నిందితుడి చేతిలోకి సగం మేర మిగలడంతో పరారయ్యాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలుకింద పడి వృద్ధుడి ఆత్మహత్య
చింతకాని: మండలంలోని అనంతసాగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(60) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా సదరు వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గరిష్ట వేగంతో రైలు వెళ్తున్న క్రమాన ఈ ఘటన జరగడంతో వృద్ధుడి శరీర భాగాలు గుర్తుపట్టలేనంతగా ముక్కలైపోయాయి. జీఆర్పీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అన్నం సేవా ఫౌండేషన్ బాధ్యులు శరీరభాగాలనుసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు
బోనకల్: మండలంలోని మోటమర్రి రైల్వేస్టేషన్ వద్ద విద్యుత్ పనులు చేస్తుండగా ఓ వ్యక్తికి షాక్‌తో తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన గజానన్ గణపతి దూకరే మరికొందరి తో కలిసి ఇక్కడ లైన్ పనులు చేస్తున్నాడు. ఈక్రమాన శుక్రవారం ఆయన పనిచేస్తూ విద్యుదా ఘాతానికి గురి కాగా శరీరమంతా కాలిపోయింది. ఈమేరకు గజానన్‌ను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
పేకాటరాయుళ ్ల అరెస్ట్
కారేపల్లి: మండలంలోని మంగల్‌తండా శివారు చెరువు వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారు కాగా, పట్టుబడిన నలుగురి నుంచి రూ.2,020 నగదుతో పాటు ఫోన్లు, బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై రాజారాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment