మెడికోలకు మెరుగైన బోధన, సౌకర్యాలు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్యం, ఆహ్లాదం కోసం జిమ్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. బాలికలు, బాలుర హాస్టళ్లలో సుమారు రూ. 4లక్షల వ్యయంతో జిమ్‌లు ఏర్పాటుచేశామని, టెన్నిస్, వాలీబాల్, షటిల్, కబడ్డీ, క్రికెట్ తదితర క్రీడల కోసం కోర్టులు సిద్ధం చేశామని తెలిపారు. గత ఏడా ది విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఈ ఏడాది ఇక్కడ చేరేందుకు ఆసక్తి కనబరి చారని పేర్కొన్నారు. ఈనేపథ్యాన మెరుగైన బోధన చేస్తూనే ర్యాగింగ్ జరగకుండా చూడడంతో పాటు ఇతర అంశాలపై 14 కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలు, 24 గంటల పాటు సెక్యూరిటీ సిబ్బందితో నిఘా కొనసాగుతోందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment