మనుగడలోకి టీజీబీ..
ఖమ్మంవ్యవసాయం: బ్యాంకుల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(ఏపీజీవీబీ)ను తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)గా మార్పు చేశారు. రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకులను ఏర్పాటుచేసి జాతీయ స్థాయిలో నేషనల్ రూరల్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏపీజీవీబీని సైతం విభజించారు. ఈమేరకు రెండు ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)గా మార్చగా బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. 1976లో నాగార్జున గ్రామీణ బ్యాంకు(ఎన్‌జీబీ)గా ఏర్పడగా, ఈ బ్యాంకు 2006లో ఏపీజీవీబీ రూపాంతరం చెందింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో టీజీబీ ఇప్పటికే నిర్వహణలో ఉన్న నేపథ్యాన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని ఏపీజీవీబీలను సైతం అదే బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏపీజీవీబీ టీజీబీగా రూపాంతరం చెందిన నేపథ్యాన వరంగల్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సైతం హైదరాబాద్‌కు మార్చనున్నారు. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని అన్ని బ్రాంచ్‌లకు టీజీబీ పేరిట బోర్డులు ఏర్పాటుచేయగా బుధవారం నుంచి ఇదే పేరుతో సేవలు మొదలయ్యాయి.
తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment