మహిళల రక్షణలో పాలకులు విఫలం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుత సమాజంలో పసిపాప మొదలు వృద్ధులైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింస పెరుగుతుండటంతో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు పి.అరుణ జ్యోతి అన్నారు. అయితే, మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా వర్క్‌షాపు మెరుగు రమణ అధ్యక్షతన శుక్రవారం జరగగా ఆమె మాట్లాడారు. మూఢ నమ్మకాలు, డ్రగ్స్, మద్యం, అశ్లీల సినిమాలతో యువత చెడు మార్గం పట్టి మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇకనైనా వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరుతో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతున్నందున రక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలిపారు. కాగా, మహిళా అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో 25 శాతం నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ, నాయకులు మాచర్ల భారతి, బి.పద్మ, పి.నాగసులోచన, మెహరున్నీసా బేగం, కె.అమరావతి, జె.సునీత, పి.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment