జిల్లా కళాకారులకు పురస్కారాలు
ఖమ్మంగాంధీచౌక్/కారేపల్లి: జిల్లాకు చెందిన ముగ్గురికి ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్‌మెంట్ సంస్థ పురస్కారాలు ప్రకటించింది. ఈమేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఖమ్మంకు చెందిన జానపద కళాకారుడు కవి, రచయిత మోదుగు గోవిందరావు, కారేపల్లికి చెందిన ఆదదెర్ల శంకర్‌కు గానకోకిల పురస్కారాలు, చింతకాని మండలం అనంతసాగర్‌కు చెందిన జానపద కళాకారిణి పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ఉత్తమ కళాకారిణి అవార్డు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సంస్థ బాధ్యులు మేకల చంద్రశేఖరయాదవ్, సుదర్శన్ మార్వాడి, రమేష్, కొమిరె వెంకన్న, సీతారాములు తదితరులు వీరికి అవార్డులు అందజేసి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment