తీర్చేలా.. | Sakshi
Sakshi News home page

తీర్చేలా..

Published Sat, Apr 20 2024 1:45 AM

- - Sakshi

వన్యప్రాణుల దాహార్తి

పెంచికల్‌పేట్‌ అడవిలో సాసర్‌పిట్‌లో నీటిని నింపుతున్న అధికారులు

పెంచికల్‌పేట్‌: రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో అటవీ ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులు నిత్యం సంచరించే ప్రాంతాల్లో సాసర్‌పిట్లు, సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నారు. అటవీప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లు ఉండగా 2,420 చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, చుక్కల దుప్పులు, మెకాలతో పాటు అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు అడవిలో ఆవాసాలు ఏర్పా టు చేసుకున్నాయి. నీటి కోసం అడవి నుంచి బయటకు వస్తే వేటగాళ్ల ఉచ్చులకు బలి కాకుండా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీటి ఎద్దడి నివారణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సాసర్‌పిట్లు, సోలార్‌ పంపుసెట్లతో..

కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని కాగజ్‌నగర్‌, పెంచికల్‌పే ట్‌, బెజ్జూర్‌, సిర్పూర్‌(టీ), చింతలమానెపల్లి, దహెగాం మండలాల్లో 127 సాసర్‌పిట్లు, 20 సోలార్‌ పంపుసెట్లు, ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 164 సాసర్‌పి ట్లు, ఆరు సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా అటవీ ప్రాంతాల్లోని 112 సహజ నీ టి వనరులైన నీటి ఊటలు, చెలిమెల్లో నీరు నిరంత రం ఉండేలా చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో ని సాసర్‌ పిట్లలో వారానికోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. సోలార్‌ పంపుసెట్ల ద్వారా వచ్చే నీటిని సమీప కుంటల్లో నింపుతున్నారు.

సీసీ కెమెరాల ద్వారా నిఘా

అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి వనరుల వద్ద అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. నీటి వనరుల సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వన్యప్రాణుల సంచారాన్ని గుర్తిస్తున్నారు. సాసర్‌పిట్లను పరిశీలిస్తూ అవసరం ఉన్నప్పుడు నీటిని అందిస్తున్నారు. నీటి కోసం వచ్చే వన్యప్రాణులు వేట గాళ్ల బారిన పడకుండా నిత్యం అటవీ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల రాకపోకలు, కదలికలను పరిశీలిస్తూ వాటి ఆవాసాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు.

అవగాహన సదస్సుల ద్వారా..

వేసవిలో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని ముందే గుర్తించిన అధికారులు గ్రామాల్లో అ వగాహన సదస్సులు ని ర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో గ్రామస్తుల బాధ్యత గుర్తు చేస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేకచర్యలు చేపడుతున్నాం

అటవీప్రాంతాల్లో సంచరిస్తున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి 10 రోజు ల క్రితం ట్యాంకర్ల ద్వారా అటవీ ప్రాంతాల్లోని సాసర్‌పిట్లలో నీటిని నింపాం. వన్యప్రాణుల కదలికలను సీసీ కెమెరాలతో గమనిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ వన్యప్రాణులకు హాని తలపెడితే కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణులు గ్రామాల సమీపంలోకి వస్తే సమాచారమివ్వాలి. వన్యప్రాణులకు హాని తలపెడితే చర్యలు తప్పవు.

– గుండు సుధాకర్‌, ఎఫ్‌ఆర్వో, పెంచికల్‌పేట్‌

అటవీప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

నీటి వనరుల అభివృద్ధికి చర్యలు

అటవీ అధికారుల చర్యలు భేష్‌

1/1

Advertisement
Advertisement