రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
సిరికొండ: మండలంలోని వాయిపేట్ వెళ్లే దారిలో సోమవారం ద్విచక్ర వాహనం, టిప్పర్ ఢీకొన్న ఘటనలో చిమ్మన్‌గూడికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పంటచేనుకు వెళ్లిన జాదవ్ విజయ్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వాహనంలో రిమ్స్‌కు తరలించారు.
సోయా దొంగల రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో గత నెల 30న 50 కిలోల సోయాబీన్ పంటను దొంగిలించిన ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన ఎరిగండ్ల రాజు, చిర్చు రాజు సోయాబీన్ చోరీకి పాల్పడా రు. పీఏసీఎస్ సెక్రెటరీ పండరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరికి గాయాలు
లోకేశ్వరం: మండలంలోని మొహళ గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై అశోక్ తెలిపారు. లోకేశ్వరంకు చెందిన జంగం స్వప్న, రాజేశ్వర్ దంపతులు నందిపేట్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా నందిపేట్ మండలంలోని బద్గుణ గ్రామానికి చెందిన సాయన్న బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్రగాయాలయ్యాయి. నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయన్నను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
యువకుడు బలవన్మరణం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బంగాల్‌పేట్ సమీపంలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుంటాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ (28)రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఉంటున్న అత్తగారింటికి వచ్చా డు. సోమవారం ఉదయం సమీపంలో ఉ న్న మామిడి తోటలో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి గణ పతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment