సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ ఏవో దామోదర స్వామి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏ వో దామోదరస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన రాము భూమి పట్టా చేయించాలని, ఆదిలాబాద్ మండలం దోతిగూడకు చెందిన దవరావు గుస్సాడీ కొరకు డబ్బులు మంజూరు చేయాలని, తిర్యాణి మండలానికి చెందిన మౌనిక ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఇంకా పింఛన్, రెండు పడకల గదుల ఇండ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయం,రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, జేడీఎం నాగభూషణం, పెసా కోఆర్డినేటర్ వసంత్‌రావు, ఏపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment