బైక్‌ను ఢీకొట్టి బొలెరో బోల్తా
ఇంద్రవెల్లి: ముందుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బొలెరో బోల్తా పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్నూర్ గ్రామానికి చెందిన వ్యా పారి గోపాల్ సోమవారం ద్విచక్ర వాహనంపై ఇంద్రవెల్లికి వస్తుండగా వెనుకనుంచి అతివేగంగా వ చ్చిన బొలెరో బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనలో బైక్ నడుపుతున్న గోపాల్‌కు తీవ్రంగా, బొలెరోలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గోపాల్‌ను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై సునీల్ ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై ఉన్న వాహనాన్ని జేసీబీ సాయంతో తొలగించి ఇంద్రవెల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా సంఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి
చెన్నూర్‌రూరల్: మండలంలోని రచ్చపల్లి గ్రామానికి చెందిన జాడి బాపు (45) అనే రైతు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపు ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని మరో రైతు వరి పొలంలో నుంచి తన పొలానికి వెళ్తుండగా సదరు రైతు తన పొలంలోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు అమర్చిన విద్యుత్ తీగలను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య తిరుపతమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.
ముగ్గురు యువకుల బైండోవర్
జన్నారం: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం సే వించి న్యూసెన్స్ చేసిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి తహసీల్దార్ రా జమనోహర్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజవర్దన్ సోమవారం తెలి పారు. పొనకల్ గ్రామానికి చెందిన మ హ్మద్ అవేజ్, మహ్మద్ ట్రాబేజ్, చిలువేరు కార్తీక్ మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్ చేయడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిపై కేసు నమోదు చేసిన ట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
సకాలంలో స్పందించి... ఆస్పత్రికి తరలించి
నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన వసీమ్ ఖురేషి (33) నాలుగు రోజుల క్రితం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది సోమవారం భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరాడు. గ్రామ శివారులోకి రాగానే ఫిట్స్ రావడంతో స్పందించిన బస్ కండక్టర్ సంపత్, డ్రైవర్ పరశురాం బస్సును నేరుగా నర్సాపూర్ (జి) 30 పడకల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ సురేందర్ ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు 108లో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కండక్టర్, డ్రైవర్‌ను ప్రయాణికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment