మరో అడుగు
మహిళా సాధికారతకు
● రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం ● సమాఖ్య కార్యాలయం, శిక్షణ కేంద్రం, తదితర అవసరాలకు వినియోగం ● జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం కేటాయింపు
ఆసిఫాబాద్: మహిళల సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మించాలని సంకల్పించింది. జిల్లా కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సంఘాల సంక్షేమంలో భాగంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించింది. మరో అడుగు ముందుకు వేసి ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లాల్లో ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున కొత్త భవనాల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళాశక్తి భవనం నిర్మించనున్నారు. ఈ క్రమంలో మహిళా సాధికారత థీమ్ పేరుతో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం సభకు జిల్లా కేంద్రం నుంచి మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు.
ఎకరం స్థలం కేటాయింపు
ప్రభుత్వం ఇందిరా శక్తి భవనం నిర్మాణం కోసం రూ.5 కోట్ల నిధులు మంజూరు కాగా.. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ శివారులో నోటిఫైడ్ ప్రాంతం సర్వే నం. 42లో ఎకరం స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటా యించారు. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతోపాటు కొత్తగా సభ్యులను చేర్పించడం, మహిళా శక్తి కార్యక్రమ నిర్వహణ, రుణ బీమా, ప్రమాద బీమా పథకాల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాంల తయారీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, బ్యాంకు లింకేజీ, వడ్డీలేని రుణాలు, చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేయడంతోపాటు మహిళల సంక్షేమం కోసం తీసుకునే చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై తీర్మానా లు చేశారు. కొత్తగా నిర్మించే జిల్లా సమాఖ్య భవనా నికి అవసరమున్న ప్రభుత్వ స్థలానికి సంబంధించి న పూర్తి నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తహసీల్దార్‌ను ఆదేశించారు. భవనానికి అవసరమైన మౌలిక వసతులకు ఆయా ప్ర భుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలన్నా రు. ఈ విషయమై డీఆర్‌డీవో దత్తారావును సంప్రదించగా.. జిల్లాకు రూ.5 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి భవనం మంజూరైనట్లు తెలిపారు. అంకుసాపూర్ శివారులోని వైద్యకళాశాల సమీపంలో స్థలాన్ని గుర్తించామని వివరించారు.
90,112 మంది సభ్యులు
జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 398 గ్రామ సంఘాలు, 8,100 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. 90,112 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 898 స్వయం సహాయక సంఘాలకు రూ.53 కోట్ల రుణాలు, సీ్త్రనిధి పథకం కింద రూ.7 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ప్రతినెలా మహిళా స్వయం సహాయక సంఘాలు సమావేశాలు నిర్వహించుకుని సంఘ అభివృద్ధికి పలు తీర్మానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇందిరా మహిళా శక్తి భవనం మహిళా సంఘాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇందులోనే జి ల్లా సమాఖ్య కార్యాలయం, శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్డు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment