గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: అనంతమైన విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ చదువుకుని 20 మంది అభ్యర్థులు పోలీసు, గూప్స్ ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పాటల పోటీలు, కవిసమ్మేళనం, రంగోళి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి సరిత, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, అధికారులు సదానందం తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్– 4కు ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన
ఆసిఫాబాద్: గ్రూప్– 4 ద్వారా రెవెన్యూ శాఖలో ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో పరిశీలించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఇటీవల విడుదలైన గ్రూప్– 4 ఫలితాల్లో రెవెన్యూ శాఖలో 39 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment