రక్షణకు రేకులే అడ్డు
పెరిగిన చలితీవ్రత
తిర్యాణి: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నా యి. బుధవారం రాష్ట్రంలోనే రెండో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత జిల్లాలోనే నమోదైంది.
ప్రాంతం కనిష్ట ఉష్ణోగ్రత
(డిగ్రీల సెల్సియస్)
సిర్పూర్(యూ) 9.7
తిర్యాణి 11.1
కెరమెరి 12.3
వాంకిడి 12.4
గిన్నెధరి 12.6
ఆసిఫాబాద్ 12.7
చింతలమానెపల్లి 13.4
దహెగాం 13.7
బంబార ఆశ్రమ వసతిగృహంలో అధ్వానంగా కిటికీలు
దుప్పట్లు పంపిణీ చేయాలి
ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రభుత్వం దుప్పట్లు పంపిణీ చేయాలి. పడుకునే గదులకు సరైన తలుపులు లేక ఈదురుగాలులకు నిద్రపట్టడం లేదు. అధికారులు స్పందించి కొత్త తలుపులు అమర్చాలి.
– మెస్రం సంజు, తొమ్మిదో తరగతి,
పోచంలొద్ది, మం.జైనూర్
ఆరుబయటే స్నానం
మా హాస్టల్‌లో సోలార్ వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. చలి ఉన్నా ఆరుబయట చల్లటి నీటితోనే స్నానం చేస్తున్నాం. ఈదురు గాలులకు వణికిపోతున్నాం. ఇంటి నుంచి స్వెటర్
తెచ్చుకున్నా.
– సందీప్, మొగడ్‌దగడ్, మం.కౌటాల
సౌకర్యాలు కల్పిస్తాం
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న వి ద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తాం. సంఖ్య కు అనుగుణంగా వసతులు లేవు. ఇప్పటికే బెడ్‌షీట్లు, కార్పెట్లు అందించాం. దుప్పట్లు రావాల్సి ఉంది. వేడినీటి కోసం వాటర్ హీటర్ల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే ఏర్పాటు చేస్తాం. – రమాదేవి, డీటీడీవో
చలిలో చన్నీళ్లు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. నవంబర్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఈదురు గాలులు, ఎముకలు కొరికే చలికి వసతిగృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు పంపిణీ కాకపోవడంతో ఇంటి నుంచే తెచ్చుకుని వాడుకుంటున్నారు. పడుకునే గదులకు తలుపులు, కిటికీలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రేకులు అడ్డుగా పెట్టుకుంటున్నారు. ఇటీవల వాంకిడి గిరిజన బాలికల వసతిగృహంలో 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో చలికాలంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణపై అధికారులు దృష్టి సారించా లని తల్లిదండ్రులు కోరుతున్నారు. వసతిగృహాల్లో పరిస్థితిపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వసతి గృహాల్లో 27,978 మంది
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు 102 ఉన్నాయి. ఇందులో మొత్తం 27,978 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 46 ఆశ్రమ వసతి గృహాల్లో 12,562 మంది ఉండగా, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది, ఏడు గిరిజన గురుకుల(పీటీజీ)ల్లో 2,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకులాల్లో 1,185, రెండు మోడల్ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో 980 మంది విద్యార్థులు ఉన్నారు.
దుప్పట్లు అందలే..
తిర్యాణి(ఆసిఫాబాద్): మండలంలోని మంగీ, రొంపెల్లి, సుంగాపూర్, పంగిడిమాదర, తిర్యాణిలో బాలుర ఆశ్రమ పాఠశాలలు, చెలిమల, గిన్నెధరిలో బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న మండలంలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేసినా నిర్వహణ లేక మూలన పడ్డాయి. దుప్పట్లు కూడా అందకపోవడంతో చలికి వణుకుతున్నారు.
శిథిలావస్థకు చేరిన భవనం
జైనూర్(ఆసిఫాబాద్): మండలంలోని పోచంలొద్ది ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరింది. చాలా వరకు తలుపులు, కిటికీలు లేవు. విద్యార్థులు ఎముకలు కొరికే చలిలోనే నిద్రిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలం మొగడ్‌దగడ్ ఆశ్రమ పాఠశాలలో 143 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతి గృహంలో సోలార్ వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. ప్రతిరోజూ విద్యార్థులు ఆరుబయటే చలిలో చన్నీటితో స్నానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు స్వెటర్లు, రగ్గులు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న వాటినే వినియోగిస్తున్నారు. హాస్టల్ గదులను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని సిబ్బందిని కోరగా.. ఐటీడీఏ పీవో ఎవర్నీ లోపలికి రానీయొద్దని ఆదేశాలు ఇచ్చారని ఉపాధ్యాయులు నిరాకరించడం గమనార్హం.
వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని బంబార ఆశ్రమ వసతిగృహంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ 200లకు పైగా విద్యార్థులు చదువుకుంటుండగా సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఆశ్రమ విద్యార్థులకు దుప్పట్లు అందలేదు. గదులకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో రాత్రిపూట చలికి వణుకుతున్నారు. వాటర్ హీటర్ లేకపోవడంతో చన్నీటితో స్నానం చేస్తున్నారు. సరిపడా బాత్రూంలు కూడా లేవు.
Comments
Please login to add a commentAdd a comment