రాజ్యాంగంపై విధేయత కలిగి ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): దేశ రాజ్యాంగంపై ప్రతిఒక్క రూ విధేయత కలిగి ఉండాలని లయోలా సంస్థ ఉభయ రాష్ట్రాల కోఆర్డినేటర్ కరుణారావు అన్నా రు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు వారి సహకారంతో లయోలా సంస్థ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ మంగళవారం ముగిసింది. భారత రాజ్యాంగం అమలు తీరు, ప్రజాస్వామ్యం, పౌరసత్వం, సమాచార హక్కు చట్టం తదితర అంశాలపై యువతీ, యువకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫాదర్ సెల్విన్, పెసా చట్టం కోఆర్డినేటర్ వసంత్‌రావు, ఆదిలాబాద్ ట్రైబల్ ఎంపవర్మెంట్ సొసైటీ అధికారులు అమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment