ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలను జిల్లాలో సక్సెస్ చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నందున ఈ నెల 23న జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నందున ఈ నెల 19నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 23న సాయంత్రం 4గంటలకు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ టాటియా గార్డెన్స్‌లో తలపెట్టిన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ రాయితీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరా మహిళాశక్తి, ఉద్యోగాల కల్పన, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం లాంటి పథకాలపై ప్రభుత్వం తరఫున వచ్చే అంతడుపుల నాగరాజుతో కూడిన 80 మంది సాంస్కృతిక కళాకారుల బృందంతో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment