రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
దహెగాం: ఽవరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌తోపాటు సబ్‌కలెక్టర్ శ్రద్దా శుక్లా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం అధికంగా వస్తున్నందున ఎప్పటికప్పుడు తూకం వేసి తరలించాలని సూచించారు. తేమ 17శాతం కంటే తక్కువ ఉన్నా కాంటా చేసి మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. గతేడాది లాగా ఈసారి కోత విధించకుండా మిల్లుల వద్ద రెవెన్యూ అధికారులు ఉండేలా చూస్తామని చెప్పారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగో ళ్లను వేగవంతం చేయాలని కేంద్రం నిర్వాహకుల కు సూచించారు. మిల్లర్లు రైతులను ఇబ్బందుల కు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పా రు. ధాన్యం అమ్మిన రైతులకు రెండు, మూడ్రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూసమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని, సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సహకార సంఘం చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, డీఎం నరసింహారావు, ఏఎస్వో సాధిక్, డీసీవో బిక్కునాయక్, డీఆర్డీవో దత్తారాం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాముల్, ఏడీఏ మనోహర్, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో రాజేందర్, ఏపీఎం చంద్రశేఖర్, ఏపీవో కల్పన, పీఏసీఎస్ సెక్రటరీ నారాయణ, సెంటర్ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
ప్రెస్‌క్లబ్ గ్రంథాలయం సందర్శన
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రెస్‌క్లబ్‌ను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దాశుక్లా సందర్శించారు. ప్రెస్‌క్లబ్‌లో కొనసాగుతున్న గ్రంథాలయాన్ని పరిశీలించి పాత్రికేయులను అభినందించారు. గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలు అందిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ను పాత్రికేయులు శాలువాతో సన్మానించారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కొనుగోలు కేంద్రం సందర్శన
రెవెన్యూ రికార్డుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment