ఆసిఫాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న టీ– ఫ్రైడ్ పథకంలో ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారికి టాక్సీప్లేట్ కార్లు/టాక్సీలకు అందించే రాయితీ నుంచి మినహాయించినట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మదిరే అశోక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా రంగంలో భాగంగా జేసీబీలు, డెలివరీ వ్యాన్లు, జట్కింగ్ మిషిన్లు, టాక్సీ ప్లేట్ కార్లు, టాక్సీలు రాయితీ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 1నుంచి టాక్సీ ప్లేట్ కార్లు/టాక్సీలకు సబ్సిడీ పొందేందుకు టీ–ఫ్రైడ్ నుంచి మినహాయించినట్లు తెలిపారు. టాక్సీ ప్లేట్ కార్లకు మినహా మిగితా వాహనాలన్నింటికీ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు మార్పులను గమనించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment