పక్కాభవన నిర్మాణానికి చర్యలు
దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి మహాత్మా జ్యోతీబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షి యల్ పాఠశాల, కళాశాల కాగజ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్నందున ఈనెల 10న ‘సాక్షి’లో ‘గురుకుల చదువుకు దూరం’ శీర్శికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్పందించారు. శుక్రవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పాఠశాలను సందర్శించారు. మండలంలోని చినరాస్పెల్లి గ్రామంలో భూమి కేటాయించి త్వరలో పక్కా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలలోని గదులు, వంట గది, మూ త్రశాలలు, వంట సామగ్రి, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని చెప్పారు. సౌకర్యాలు, బోధన తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన సరుకులు వినియోగించాలని, స్నానపు గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించా రు. కలెక్టర్ వెంట బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధి కారి సజీవన్, తహసీల్దార్ కిరణ్‌కుమార్, ప్రిన్సి పాల్ సీహెచ్ మంగ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment