న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Sat, Nov 23 2024 12:10 AM | Last Updated on Sat, Nov 23 2024 12:10 AM

-

24న అథ్లెటిక్స్‌ పోటీలు

ఆసిఫాబాద్‌రూరల్‌: ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సట్ల శంకర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–8, 10, 12 బాలబాలికలకు అథ్లెటిక్స్‌ 50, 300, 600 మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, జావెలిన్‌త్రో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే విద్యార్థులు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో రావాలని వివరించారు. పూర్తి వివరాలకు విద్యాసాగర్‌ను 8008090626 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

27నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని సెయింట్‌ మేరీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27, 28తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి 200 నుంచి 300 ప్రాజెక్టులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో పాల్గొనే విద్యార్థులను సంబంధిత ఉపాధ్యాయులు సకాలంలో తీసుకురావాలని సూచించారు. ఈ ఏడాది ‘రాష్ట్ర వైజ్ఞానిక ప్రదర్శన–సుస్థిర అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాముఖ్యత’ అంశంపై ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయడానికి ప్రతీ పాఠశాల నుంచి మూడు ప్రదర్శనలు వచ్చేలా చూడాలని మండల విద్యాధికారులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement