రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఎదులాపురం: తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థుల కు నిర్వహించిన ప్రతిభా పోటీలలో ఆదిలా బాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన అఫియా సుల్తానా ప్రథమ స్థానంలో నిలిచి ఆదివారం అవార్డు అందుకుంది. ప్రథమ స్థానంలో నిలిచిన అఫియా ను తెలంగాణ గణిత ఫోరం ఆదిలాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దిలీప్‌రెడ్డి, పిల్లి కిషన్, బండి సుభాష్, తదితరులు అభినందించారు.
గంజాయి పట్టివేత
కోటపల్లి: మండలంలోని పార్‌పల్లి వద్ద 62వ జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఆదివారం పట్టుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా గమనించిన మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన ఆలం పున్నం పారిపోతుండగా పట్టుకున్నారు. అతని వద్ద తనిఖీ చేయగా 1,550 గ్రాముల గంజాయి లభించింది. ఇంటివద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడు చెన్నూర్‌లో అమ్మేందుకు తీసుకెళ్తుండగా పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు వివరించా రు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.38 వేలు ఉంటుందన్నారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment