కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో ఆదివారం బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన గఫర్ తన కుటుంబంతో కలిసి దేగాం గ్రామ సమీపంలో గల ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. సమీపంలో అబ్దుల్ అమీర్ (3) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్సం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపి న వివరాల ప్రకారం మండలంలోని గొడిసెరా గ్రామానికి చెందిన దుంపల లక్ష్మణ్ (30)కు బాసర మండలంలోని మైలాపూర్‌కు చెందిన ప్రమీలతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న లక్ష్మణ్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. దీంతో మూడునెలల క్రితం ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై శనివా రం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఆ దివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment