జాతీయ రహదారిపై ప్రమాదం
● బైక్ ఢీకొని నాలుగు మేకలు మృతి ● యువకుడికి తీవ్రగాయాలు
వాంకిడి: ద్విచక్ర వాహనం మేకలను ఢీకొన్న ఘట నలో ఒకరికి తీవ్రగాయాలు కాగా నాలుగు మేకలు మృత్యువాతపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆసిఫాబాద్‌కు చెందిన మాలి విక్రమ్ వాంకిడి మండల కేంద్రంలో ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వాంకిడికి వెళ్తుండగా టోల్‌ప్లాజా సమీపంలో అడ్డువచ్చిన మేకలను ఢీకొట్టాడు. ఘటనలో నాలుగు మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. ఘటనపై ఎస్సై ప్రశాంత్‌ను సంప్రదించగా ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment