‘బలవంతపు మతమార్పిడిని ఉపేక్షించం’
జన్నారం: బలవంతపు మతమార్పిడికి పాల్పడితే ఊరుకునేది లేదని హిందూవాహిని, ధర్మజాగరణ జిల్లా ప్రముఖ్ కొండగొర్ల శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని పొనకల్, జన్నారం గ్రామాల పరిధిలో కొందరు మతప్రచారం చేస్తుండగా అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మత ప్రచారం చేయడం సరికాదన్నారు. బలవంతపు మతమార్పిడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ధర్మజాగరణ, హిందూవాహిని నాయకులు నల్లపు కృష్ణ, శ్రీధర్, అరవింద్, తదితరులు ఉన్నారు.
ఆలయంలో చోరీకియత్నం
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర ఆలయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి హుండీని పగులగొట్టే ప్రయత్నం చేశారు. శబ్ధం విన్న గ్రామస్తులు కేకలు వేయగా కారులో భైంసావైపు పారిపోవడంతో 100 కు సమాచారం ఇచ్చారు. గుండెగాం వద్ద కారు టైరు పేలిపోయి కల్వర్టును ఢీకొట్టి ఆగిపోవడంతో పోలీసులు వచ్చి కుభీర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. చోండిలోని దత్తాసాయి మందిరంలో చోరీకి యత్నించి సిలిండర్‌ను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment