ఘనంగా సింగరేణి డే వేడుకలు
మందమర్రిరూరల్: సింగరేణి ఆవిర్భావ వేడుకలను సోమవారం మందమర్రి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయం వద్ద, సింగరేణి హైస్కూల్ మైదానంలో జీఎం దేవేందర్ సింగరేణి జెండాను ఎగురవేశారు. మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన పలు విభాగాల స్టాల్స్‌ను సేవా సమితి అధ్యక్షురాలు స్వరూపరాణి ప్రారంబించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం సింగరేణి స్థితిగతులను వివరించారు. 135 సంవత్సరాల చరిత్రలో సింగరేణి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందని అన్నారు. దేవ్యాప్తంగా వ్యాపార రంగంలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తూ పోటీ రంగంలో సింగరేణి ముందు వరుసలో ఉందన్నారు. పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వో టూ జీఎం విజయ్‌ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్,ఽ అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment