అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి వసతులు
ఆసిఫాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్ప నకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిశు సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీవీటీజీ గ్రామాల్లో ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఎంపికైన అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, భవనాలకు రంగులు, పిల్లలకు ఆటవస్తువులు సమకూర్చాలని సూచించారు. భవనాల మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలను ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వసతులు కల్పనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సీడీపీవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment