పత్తి కొనుగోళ్లు నిలిపివేత
ఆసిఫాబాద్‌అర్బన్: క్రిస్మస్ పండుగ, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి, గింజల నిల్వలు అధికంగా ఉన్నందున ఆసిఫాబాద్, వాంకిడి, కొండపల్లి(రెబ్బెన), సిర్పూర్(టి), కౌటాల జిన్నింగ్ మిల్లుల్లో బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ హైమద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి వదంతులు నమ్మి తొందరపడి తమ వద్ద ఉన్న పత్తిని ఒకేసారి కొనుగోలు కేంద్రానికి తీసుకురావొద్దని కోరారు. రవాణా, వెయిటింగ్ ఖర్చు భారం చేసుకోవద్దన్నారు. రైతుల వద్ద పంట ఉన్నంత వరకు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment