27, 28న పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె
రెబ్బెన(ఆసిఫాబాద్): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27, 28 తేదీల్లో పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, జీవో నంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల వారిగా వేతనాలు పెంచాలని, కా రోబార్, బిల్ కలెక్టర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీపీ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరపాల ని ప్రభుత్వానికి విన్నవించగా స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేశ్, వెంకటేశ్, దేవాజీ, ప్రవీణ్, సునీల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment