కవ్వాల్‌లో కాంపా పీసీసీఎఫ్ పర్యటన
జన్నారం: కాంపా పీసీసీఎఫ్(ముఖ్య అటవీ సంరక్షణ అధికారి) సునీత బుధవారం కవ్వాల్ టైగర్‌జోన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించా రు. జన్నారం అటవీ డివిజన్‌లో ఉదయం సఫా రీ ద్వారా ప్రయాణం చేశారు. అడవిలో పక్షులు, జంతువుల పరుగులను చూసి మురిసిపోయా రు. అనంతరం గడ్డిప్రాంతాలు, కుంటలు, ఇత ర అభివృద్ధి పనులు సందర్శించారు. ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లోని వాచ్‌టవర్, మైసమ్మకుంట, ఘనిషెట్టి కుంట ప్రాంతాల్లో పర్యటించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్, గడ్డి ప్రాంతాలు పరిశీలించారు. టైగర్‌ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ్ ఆశిష్ సింగ్, రేంజ్ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment