28 నుంచి టీజీబీ సేవలు నిలిపివేత
వాంకిడి(ఆసిఫాబాద్): ఈ నెల 28 నుంచి 31 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు నిలిపివేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభుదా స్, వాంకిడి బ్రాంచ్ మేనేజర్ జాడి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆంధ్రప్రదే శ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(ఏపీజీవీబీ) శాఖ లు 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో టీజీబీ ప రిధిలోని లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు పే ర్కొన్నారు. ఏటీఎం, యూపీఐ పేమెంట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాలెన్స్ ఇంకై ్వరీ తది తర ఆన్‌లైన్ సేవలు, ఖాతాదారుల సేవా కేంద్రాలు(సీఎస్‌పీ) ఈ నెల 31 వరకు అందుబా టులో ఉండవని స్పష్టం చేశారు. ఖాతాదారులు ముందస్తు లావాదేవీలు చేసుకోవాలని సూచించారు. సేవలు జనవరి 1 నుంచి పునఃప్రారంభమవుతాయని తెలిపారు.
‘సమగ్ర’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిపాబాద్‌రూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింపజేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, మొదటి పీఆర్‌సీ సిఫారసు మేరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment