బోధనకు బ్రేక్..!
● నేటి నుంచి సమ్మెలోకి వందశాతం కేజీబీవీ, యూఆర్‌ఎస్ టీచింగ్ స్టాఫ్ ● త్వరలో వంట కార్మికులు కూడా.. ● నష్టపోనున్న విద్యార్థులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని జిల్లా కేంద్రంలో 17 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేపడుతుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వారికి స్పష్టమైన హామీ రాలేదు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని వందశాతం టీచర్లు స మ్మెలోకి వెళ్లనున్నారు. ‘సమగ్ర’ ఉద్యోగుల సంఘం నాయకులు ఇప్పటికే జిల్లా విద్యాధికారి యాద య్య, కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. టీచింగ్ సిబ్బంది వందశాతం సమ్మెలోకి వెళ్తుండటంతో బోధన నిలిచిపోనుంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 15 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆసిఫాబాద్‌లో ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉండగా, 4,168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక ఫలితా ల్లో ఇవి ఏటా మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా ఆ యా పాఠశాలల్లో ఇద్దరు సీఆర్‌టీలు పగలు, మరో ఇద్దరు రాత్రిపూట విధులు నిర్వర్తిస్తున్నారు. సీఆర్టీ లు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నారు. శుక్రవారం నుంచి వంట కా ర్మికులు మినహా ఎస్‌వోలతోపాటు బోధన సిబ్బంది, ఇతరులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాత్కాలిక ఎస్‌వోల నియామకం..!
వందశాతం సమ్మెలోకి వెళ్తున్నట్లు కేజీబీవీ, యూ ఆర్‌ఎస్ సిబ్బంది మూడు రోజుల క్రితమే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు అందించారు. అప్రమత్తమైన విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమైంది. ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్లను ఎస్‌వో లను తాత్కాలికంగా నియమించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల నుంచి విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించారు. శుక్రవారం నుంచి వారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఒక్కో విద్యాలయంలో 12 నుంచి 16 మంది సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు పనిచేస్తున్నారు. బో ధనకు ఆటంకం లేకుండా మహిళా ఉపాధ్యాయుల ను నియామకంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఎస్ వోలు తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన వెంటనే వంట కార్మికులు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నా రు. వంట కార్మికులు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్, స్వీపర్, వాచ్‌మెన్‌లు లేకుండా విద్యాలయాల నిర్వహణ సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లా వివరాలు
కేజీబీవీలు 15
యూఆర్‌ఎస్ 1
ఎస్‌వోలు 16
సీఆర్టీలు 92
పీజీ సీఆర్టీలు 65
ఏఎన్‌ఎంలు 10
అకౌంటెంట్లు 10
పీఈటీలు 12
వంట కార్మికులు 114
విద్యార్థులు 4,168
Comments
Please login to add a commentAdd a comment