బలహీన వర్గాల పక్షాన సీపీఐ పోరాటం
రెబ్బెన(ఆసిఫాబాద్): బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లోని కేఎల్ మహేంద్రభవన్‌లో గురువా రం సీపీఐ వందో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకం ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ త్యాగాలు, పోరాటాల చరిత్ర కలిగిన సీపీఐ పార్టీ జెండా పట్టుకుని పేద ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఎర్రజెండా అండతోనే భూమిలేని నిరుపేదలకు వందల ఎకరాల భూపంపిణీ జరిగిందని గుర్తు చేశారు. ఓట్లు సీట్లు, పొత్తులు ఎత్తుల వంటి ప్రలోభాలకు లొంగకుండా పోరాడుతున్నది కేవలం సీపీఐ పార్టీ మాత్రమే అన్నారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి జగ్గయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషశయనరావు, రాజేశ్, కిరణ్‌బాబు, చంద్రశేఖర్, సీపీఐ బెల్లంపల్లి కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు అశోక్, సాగర్, ఫిట్ కార్యదర్శులు మారం శ్రీనివాస్, ఎంబడి రామయ్య, కందుల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment