ఆసిఫాబాద్: రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.శేషారావు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా నాలుగు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు 33/11 సబ్‌స్టేషన్‌లోని నాలుగు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్స్ వ్యవస్థ పటిష్టపరుస్తున్నామని తెలిపారు. ఓవర్‌లోడ్ ఉన్న 33 కేవీ, 11కేవీ ఫీడర్లను గుర్తించి, అందుకు అనుగుణంగా లోడ్ రిలీఫ్ చేయడానికి లోడ్ బదలాయింపు చేస్తున్నట్లు వివరించారు. కౌటాల మండలంలో ట్రాన్స్‌కోకు సంబంధించిన 132 కేవీ సబ్‌స్టేషన్ పనులు 75 శాతం పూర్తయ్యాయని, ఫిబ్రవరి చివరి వరకు పూర్తి చేస్తామని తెలిపారు. కెరమెరి దహెగాం, కౌటాల, సిర్పూర్–టి మండలాల్లో కెపాసిటర్ బ్యాంక్స్ అమర్చామని పేర్కొన్నారు. 11 కేవీ ముత్యంపేట ఫీడర్‌లోని లైన్ కెపాసిటర్స్ బిగించామని, తద్వారా ఓవర్‌లోడ్, వోల్టేజీ సమస్య తీరుతుందన్నారు. ఆస్పత్రి, మెడికల్ కళాశాల, పోలీస్ స్టేషన్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment