ఘనంగా వాజ్‌పేయి జయంతి
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలో మాజీ ప్రధా ని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు, నాయకులు వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. వాజపేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, వెంకటేశం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు ధనుంజయ్, శివ, సుమన్, రమేశ్, మౌనిక, హన్మంతరావు, సంతోష్ ఠాకూర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment