‘ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు’
బెజ్జూర్(సిర్పూర్): జిల్లాలో ఇటీవల ముగ్గురు విద్యార్థులు మృతి చెందినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని అందుగులగూడకు చెందిన తొర్రెం వెంకటలక్ష్మి మృతి చెందగా, శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు పనిచేసే కమాండ్ కంట్రోల్ ద్వారా లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేశామన్నారు. ప్రస్తుతం హాస్టళ్లలో కనీసం హెల్త్ సూపర్‌వైజర్లను సైతం నియమించలేదని ఆరోపించారు. జీఎన్‌ఎం పూర్తిచేసిన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో వసతిగృహాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన లో మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించిన విధంగానే జిల్లాలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రజాప్రతినిధులు ఆదుకోవాలన్నారు. అసెంబ్లీలో విద్యార్థుల గురించి మాట్లాడకపోవడం సరికాదన్నారు. పోలీసులు లాక్కున్న బీఆర్‌ఎస్ కార్యకర్తల ఫోన్లు తిరిగి అప్పగించాలని కోరారు. నాయకులు రాజ్‌కుమార్ యాదవ్, సలీం, రాంప్రసాద్, మండల అధ్యక్షుడు సారయ్య, తిరుపతి, ఖాజామీయా, ఇస్తారి, ప్రవీణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment