25 నుంచి సీపీఎం రాష్ట్ర మహా సభలు
ఆసిఫాబాద్‌అర్బన్: సంగారెడ్డి జిల్లాలో జనవరి 25 నుంచి 28 వరకు సీపీఎం రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దినకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయకులతో కలిసి మహాసభల పోస్ట ర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది ముఖ్య ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. తొలిరోజు కేరళ సీఎం విజయన్, నాయకులు ప్రకాశ్ కారత్, తమ్మినే ని వీరభద్రం, ఇతర ప్రముఖులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక, సా మాజిక అంశాలపై చర్చతోపాటు పేదలు, కా ర్మికులు, మహిళలు, కర్షకులు, నిరుద్యోగ, ఉ ద్యోగుల సమస్యలపై విశ్లేషణ, భవిష్యత్తు కా ర్యాచరణ రూపకల్పనపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, టీకానంద్, కార్తీక్, నిఖిల్, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment