మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ శ్రేణుల నివాళి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌కు శుక్రవారం పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు. ఉపాధిహామీ పథకంతోపాటు ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు గుండాశ్యాం, మండల అధ్యక్షుడు చరణ్, పట్టణ అధ్యక్షుడు రఫీక్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, నాయకులు నాయకులు అసద్, శ్రీనివాస్, వినోద్, మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో రమేశ్, సిరాజ్, వినోద్, వెంకటేశ్, పోచన్న, కమలాకర్, ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment