పెద్దవాగులో పులి సంచారం
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలం గంట్లపేట్ గ్రామ సమీపంలోని పెద్దవా గులో పెద్దపులి పాదముద్రలు కలకలం సృష్టించాయి. బెబ్బులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గొంట్లపేట్ పెద్దవాగు నుంచి పెద్దపులి బొంబాయిగూడ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు బుధవారం అధికారులు నిర్ధారించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా పులి సంచారం నేపథ్యంలో గ్రామాల్లో డప్పుచాటింపు చేస్తున్నామని తెలిపారు. రైతులు, రైతు కూలీ లు చేలకు గుంపులుగా వెళ్లాలని సూచించా రు. పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment