కొనసాగుతున్న ‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మె
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరే ట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. దీక్ష శిబిరంలో క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శృతిక, ఉద్యోగులు తుకారాం, మోహన్, నగేశ్, సంతోష్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రస్మా నాయకుల మద్దతు
కాగజ్‌నగర్‌రూరల్: జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బుధవారం ట్రస్మా నాయకులు సందర్శించి వారికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారికి రూ.15 వేల ఆర్థికసాయం అందించామని ట్రస్మా స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పెద్దపల్లి కిషన్‌రావు తెలిపారు. అలాగే ఈ నెల 27న జిల్లాలోని ప్రతీ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రస్మా ప్రెసిడెంట్ దేవభూషణం, కార్యదర్శి తిరుమలచారి, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment