అన్ని మతాలను గౌరవించాలి
ఆసిఫాబాద్: సమాజంలోని అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంత విబేధాలు లేకుండా జిల్లాలో అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. యేసు ప్రభువు చూపిన మార్గంలో ప్రయాణించి, అహింసను అలవర్చుకోవాలని సూచించారు. ఎదుటి వారిపై గౌరవ భావం కలిగి ఉండాలని, ప్రేమానురాగాలు పంచాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అద్యక్షుడు అలీబిన్ అహ్మద్, నాయకులు శ్యాంనాయక్, అహ్మ ద్ బిన్ అబ్దుల్లా, చర్చి ఫాదర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను మంగళవారం సందర్శించారు. కాలం చెల్లిన సరుకులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ప్రిన్సిపాల్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment